ఒకప్పుడైతే టాలెంట్ వున్న ప్పటికీ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా ఇక నిరాశతో చదువును మధ్యలోనే ఆపేసే దుస్థితి ఉండేది అన్న విషయం తెలిసిందే. చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ చదువుకునే టాలెంటు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇక నిరాశతో ఉండేవాళ్ళు ఎంతోమంది విద్యార్థులు. కానీ నేటి రోజుల్లో మాత్రం అలా ఉండాల్సిన పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటే... ప్రస్తుతం ప్రతిభగల విద్యార్థులకు సహాయం చేయడానికి అటు ప్రభుత్వం తో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి.



 ప్రతిభగల విద్యార్థులు ఆర్థిక స్తోమత సరిగా లేక పోయినప్పటికీ ఉన్నతమైన చదువులు చదవడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ప్రస్తుతం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎంతోమంది పేదవిద్యార్థులకు చదువుకోవాలనే ఆశ సజీవంగా ఉంచుతున్నాయి స్వచ్ఛంద సంస్థలు.  అటు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎన్నో ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నత చదువులు చదివేందుకు చేయూతనిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే కిషోర్ సైంటిఫిక్ ఇన్సెంటివ్ అనే పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీం ద్వారా సైన్స్ విద్యార్థులకు ప్రతి నెల 5 నుంచి 7 వేల రూపాయల వరకూ ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఫెలోషిప్ అందిస్తారు. అయితే ఈ ప్రోత్సాహకం  పొందేందుకు 2 దశల్లో  ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.  టెన్త్ పూర్తయిన తర్వాత మ్యాథ్స్  సైన్స్ సబ్జెక్టుల్లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.  ఇలా ఉత్తీర్ణత సాధించిన ప్రతిభ గల విద్యార్థులకు ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వం కిషోర్ సైంటిఫిక్ ఇంటెన్సివ్ పథకం ద్వారా ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: