2014లో తెలంగాణ ముఖ్యమంత్రి గా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పాలి. దీని వలన ప్రజలలో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కూడా బలోపేతం అయ్యే విధంగా అడుగులు వేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు.

అలాగే భారతీయ జనతాపార్టీ కూడా ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న విషయం అందరికీ అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ కు మాత్రం అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు సీఎం కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన జిల్లాల వారీగా పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఏ నియోజకవర్గంలో అయితే టి ఆర్ ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందో ఆ నియోజకవర్గం మీద సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఆయన పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రధానంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అందుకే ముందుగా అక్కడి నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టే అవకాశాలున్నాయి. తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటుంది. అందుకే సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొన్ని భారతీయ జనతా పార్టీ బలపడుతున్న ప్రాంతాల్లో కూడా సీఎం కేసీఆర్ పర్యటన చేసి రైతులతో సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. రైతు వేదికలో సమావేశం అవుతారు. టిఆర్ఎస్ పార్టీని ఎంతవరకు కష్టాల నుంచి బయటకు లాగుతాయి ఈ ప్రయత్నాలు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: