ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రమవుతున్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ దిశ దశ మారుస్తారని ఆయనను ప్రధానమంత్రిని చేస్తే ఆ విధంగా పరిస్థితులు కనపడక పోవటంతో చాలామందిలో ఆయన పై ఆగ్రహం పెరిగిపోతుంది. ధరల పెరుగుదల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి అడుగులు వేయలేకపోతోంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై చాలా అసహనం పెరుగుతుంది అని చెప్పాలి.

క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏమాత్రం అర్థం చేసుకో లేకుండా దేశభక్తి అనే విధానంతో ప్రజల్లోకి వెళ్లడం వలన కలిసి వచ్చేది ఏమీ లేదు. దీని వలన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఎంతసేపు అర్థం లేని మాటలు మాట్లాడటం అభివృద్ధి గురించి పక్కన పెట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనివలన క్షేత్రస్థాయి సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు కూడా బయటికి వెళ్ళ వచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు... గతంలోకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు చాలా సీరియస్ గా వ్యవహరిస్తారని సమాచారం. అలాగే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ విషయంలో సీరియస్ గానే ఉన్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరగకపోగా ఇప్పుడు దేశభక్తి అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని చులకన చేశారు అనే భావనలో ఆర్ఎస్ఎస్ అధినేత ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీన్ని మోడీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: