దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా విడిగా ఉండటంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా ఎటువంటి ఇబ్బందులు రావడం లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రతిపక్షాలతో సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

తమిళనాడు ఎన్నికలు పూర్తయిన తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా దక్షిణాది రాష్ట్రాల నేతలను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆయన తయారు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిన ఉన్న బలమైన నేతలను ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా ఆయన సమావేశం కానున్నారు.

అయితే ఇప్పుడు కొన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. ప్రాంతీయ పార్టీలు బలోపేతమయ్యాయి అంటే కొన్నికొన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ప్రాంతీయ పార్టీల నుంచి సహకారం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రధాన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి కాకుండా మరో పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టాలిన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి స్టాలిన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: