చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా భారత్ లో  ఎంతలా విజృంభించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  మొదట్లో కేవలం వేల సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఒకే రోజులో లక్షల కేసులు నమోదైన పరిస్థితి రావడంతో అటు దేశ ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం తో మళ్లీ సాధారణ పరిస్థితికి వచ్చింది కరోనా  వ్యాప్తి .  అయితే కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  వైరస్ వెలుగులోకి రాగానే పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ తెరిచినా  ప్రభుత్వాలు భయం భయంగానే పాఠశాలలను నిర్వహిస్తున్నాయి



 ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి మరి పాఠశాలలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తూనే అటు స్కూళ్లలో విద్యా బోధన చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలను పునఃప్రారంభం చేసినప్పటికీ మరోసారి కరోనా వైరస్ పంజా విసిరి పాఠశాలలో భారీ సంఖ్యలో విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం అయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఇలాంటి తరహా పరిస్థితి నెలకొంది హర్యానాలో.



 హర్యానాలో ఇటీవలే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించింది. కానీ అదే సమయంలో కరోనా వైరస్ మాత్రం పాఠశాలను వెంటాడుతూనే ఉంది. ఇటీవలే ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. కర్నల్ జిల్లాలోని సైనిక్ స్కూల్ లో 590 మంది విద్యార్థులకు కరుణ పరీక్షలు చేయగా 54 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు స్కూల్ మొత్తాన్ని మూసివేసి.. ఇక ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.. ఈ క్రమంలోనే మరికొంత మంది విద్యార్థులకు కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని భావిస్తున్న అధికారులు ఇక వారిని అప్రమత్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: