మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు.. వ్యాఖ్య‌లు జోరందుకున్నాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం తో ఉన్నార‌ని.. ఆయ‌న‌ను త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న‌లో త‌ప్పిస్తార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న సామాజిక వ‌ర్గం నుంచి తీవ్ర వ్య‌తిరేక వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో మంత్రి గారికి ఇటీవ‌ల కాలంలో పార్టీలోనూ.. బ‌య‌ట కూడా సెగ ‌త‌గులుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రుగుతోంది ?  నిజంగానే త‌న‌పై వ్య‌తిరేక‌త ఉం‌దా ?  సీఎం జ‌గ‌న్ నాకు అత్యంత స‌న్నిహితుడు క‌దా ? ఎంతో మంది మంత్రులు ఉన్నా త‌న‌ను న‌మ్మే క‌దా మంత్రి ప‌ద‌వి ఇచ్చారు ? అలాంటి ప‌రిస్థితిలో ఇలాంటి ప్ర‌చారం ఏంటి ? అని వెలంప‌ల్లి తెగ మ‌ద‌‌న ప‌డుతున్నారు. ఇదే విష‌యంపై ఆయ‌న తెర‌వెనుక ఏం జ‌రుగుతోంది ? అనే విష‌యాల‌పై ఆయ‌న కూపీ లాగిన‌ట్టు తెలిసింది.

త‌న‌పై సొంత సామాజిక వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న‌కు అర్ధ‌మైంది. ముఖ్యంగా టీడీపీలోని కొంద‌రు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే.. వైశ్య సామాజిక వ‌ర్గాన్ని త‌న‌కు దూరం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రికి ఉప్పందింది. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో త‌న‌పై విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని మంత్రిగారు భావించారు.. అదే స‌మ‌యంలో త‌న పార్టీలోనే కీల‌క నేతగా ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఒక వైశ్య నాయ‌కుడు కూడా త‌న‌పై వ్య‌తిరేక‌త పెంచే క్ర‌మంలో పావులు క‌దుపుతున్న‌ట్టు మంత్రిగారు గుర్తించారు. ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే.. ముగ్గురు నాయ‌కులు మాత్ర‌మే వైశ్య సామాజిక వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వీరిలో వెలంప‌ల్లికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ల‌భించింది. ఈయ‌న‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తే.. త‌మ‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని స‌హ‌జంగానే వారు భావిస్తున్నారు. దీంతో ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వారు వినియోగించుకుని.. మంత్రికి వ్య‌తిరేకంగా త‌మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే విమ‌ర్శలు చేయిస్తున్నార‌ట‌. ఇక‌, కొన్నాళ్ల కింద‌ట‌.. వైశ్య సామాజిక వ‌ర్గం ఓ కీల‌క కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినా.. మంత్రి హాజ‌రుకాలేదు. ఆ స‌మ‌యంంలో ఆయ‌న అంత‌ర్వేది ర‌గ‌డ‌ను ప‌రిష్క‌రించే ప‌నిలో ప‌డ్డారు.

అయితే.. దీనిని సాకుగా చూపించి.. వైశ్య సామాజిక వ‌ర్గానికి మంత్రి విల‌న్‌గా మారిపోయారంటూ.. ఓ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ విష‌యంలో వెల్లంప‌ల్లి స్వ‌యంకృతాప‌రాథం కూడా ఉంది. వైశ్య వ‌ర్గం నుంచి ఆయ‌న మంత్రిగా ఉన్న గ‌తంలో వైశ్య మంత్రుల త‌ర‌హాలో ఆ వ‌ర్గం వారికి చేరువ కాలేదంటున్నారు. దీంతో ఇప్పుడు త‌న‌పై సొంత వ‌ర్గంలోనే ఈ ప్ర‌చారం జ‌రుగుతున్నా మంత్రి త‌న వారినే మెయింటైన్ చేసుకోలేని నిస్స‌హాయ స్థితిలో వెల్లంప‌ల్లి ఉన్నారు. దీంతో వెలంప‌ల్లి ఏం చేయాల‌నే ప‌రిస్థితిపై చ‌ర్చిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: