అనంతపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు అంటే నిన్న జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.. ఒక్క అనంతపురం కార్పొరేషన్ లో మాత్రమే 25 మంది విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిజానికి గత ఏడాది మార్చిలో నామినేషన్ల పరిశీలన జరగాల్సిన సమయంలో ఎన్నికలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు నిన్న ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ఇచ్చారు. నిన్న మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ముందుగా హిందూపురం మున్సిపాలిటీ విషయానికి వస్తే 26 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

అలాగే గుంతకల్లు విషయానికి వస్తే 40 మంది తాడిపత్రి విషయానికి వస్తే 49 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ధర్మవరంలో 28 మంది కదిరిలో 15 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కళ్యాణదుర్గంలో ఎనిమిది మంది రాయదుర్గంలో 34 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక గుత్తిలో 18 మంది మడకశిర నగర పంచాయతీలో 14 మంది పుట్టపర్తి నగర పంచాయతీలో 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

ఇక పార్టీల పరంగా చూస్తే వైసీపీ నుంచి మొత్తం 146 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తెలుగు దేశం విషయానికి వస్తే 68 మంది జనసేన విషయానికి వస్తే ఐదుగురు బిజెపి విషయానికి వస్తే 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక సీపీఎం నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ముగ్గురు 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఇక ఈ రోజు కూడా నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండటంతో మొత్తం ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేది ఈరోజు సాయంత్రం మూడు గంటల తర్వాత తెలియనుంది. చూడాలి మరి ఈ సారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారు అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: