పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ వైపు సినిమాలు చకచకా చేస్తున్నారు. మరో వైపు రాజకీయాలను కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశకత్వంలో పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు గట్టిగానే పోరాడారు. ఉనికి చాటుకున్నారు. ఇపుడు మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. మరి జనసేన సంగతేంటి.

రాష్ట్రంలో 12 కార్పోరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం కూడా ముగిసింది.  ఒక ప్రచారానికి మిగిలింది కచ్చితంగా అయిదు రోజులు మాత్రమే. దాంతో పవన్ ఎన్నికల ప్రచారం ఎపుడు ఉంటుంది అన్నది పెద్ద చర్చగా ఉంది. అయితే ఏపీలోనే ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పొరేషన్ మీద అందరి కళ్ళూ ఉన్నాయి. ఇక్కడ గెలిస్తే చాలు ఏనుగు కుంభస్థలం కొట్టినట్లే అని కూడా భావిస్తున్నారు.  విశాఖ మేయర్ మీద టీడీపీ వైసీపీ కన్ను ఉంది. దాంతో రెండు పార్టీలు గట్టిగానే నిలబడుతున్నాయి. ఇక బీజేపీ జనసేన మూడవ కూటమిగా సత్తా చాటుతాయా. చాటితే వాటి పవర్ ఎంత అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖలో పవన్ సామాజిక వర్గం ఎక్కువ. అలాగే పవన్ గాజువాక నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. దంతో ఆ ఆ ప్రభావం ఉంటుందా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ విశాఖలో విసృతమైన ప్రచారానికి రంగం సిధ్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. పవన్ విశాఖలో తన ఎన్నికల ప్రచారం చివరలో గట్టిగా చేస్తారట. అంటే లాస్ట్ పంచ్ పవన్ దే అన్న మాట. మరి విశాఖలో ఇప్పటికే వైసీపీ టీడీపీ దూకుడుగా ఉన్నాయి. బీజేపీ జనసేన కూటమి ప్రచారం కొంత చప్పగా సాగుతోంది. ఈ నేపధ్యంలో పవన్ చివరలో చేసే ప్రచారంతో అయినా ఊపు వస్తుందా అన్నదే చర్చ. చూడాలి మరి. ఏది ఏమైనా పవన్ ప్రచారంలోకి వస్తే ఆ లెక్కే వేరు అంటున్నారు జనసైనికులు.



మరింత సమాచారం తెలుసుకోండి: