ఇంటర్నెట్ డెస్క్: ఏడాదిగా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్నాం. ఇప్పుడిప్పుడే దాని బారి నుంచి బయటపడుతూ కొద్దిగా ఉపశమనం పొందుతున్నాం. వ్యాక్సిన్‌లు కూడా రావడంతో కరోనా వైరస్‌ను అంతమొందించగలమన్న నమ్మకం కూడా ఏర్పడింది. అయితే కరోనా కంటే ఘోరమైన వైరస్ మరొకటి ప్రపంచాన్ని కబళించేందుకు సిద్ధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఒకానొకప్పుడు ఏకంగా 5 కోట్ల మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ వైరస్ ఇప్పుడు మళ్లీ విజృంభించేందుకు ప్రయత్నిస్తోందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

సరిగ్గా వందేళ్ల క్రితం.. 1918లో దాదాపుగా ఐదు కోట్ల మందిని ఈ స్పానిష్ ఫ్లూ పొట్టనపెట్టుకుంది. ఎటువంటి చికిత్స లేకపోవడంతో వైరస్ బారిన పడినవారు కళ్లముందే చనిపోతున్నా ఎవరూ ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది. కనీసం చనిపోయిన వారిని దగ్గరకు వెళ్లి చూసేందుకు కూడా వీల్లేని ఈ మహమ్మారి మళ్లీ అనేక దేశాల్లో బయపడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో అధికారులు హెచ్చరిస్తున్నారు.

డబ్ల్యూహెచ్‌వో డాక్టర్ మెక్ కాలే దీనిగురించి మాట్లాడుతూ.. కరోనాను మించిన ప్రమాదకారి వైరస్ స్పానిష్ ఫ్లూ అని చెప్పారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కామన్ ఫ్లూ ప్రబలుతోందని, ఈ ఫ్లూ మరిన్ని వైరస్‌లకి దారి తీస్తుందని, డాక్టర్ కాలే చెబుతున్నారు. సీజనల్‌గా వచ్చే జబ్బులు, ఇతర ఫ్లూ వంటి వ్యాధులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే అంతటికి కారణం అని, ఇదే మానవుడిని అనేక రోగాల బారిన పడేస్తుందని కాలే వెల్లడించారు.

వచ్చే చలి కాలానికి ఫ్లూ వంటి మహమ్మారులు ప్రబలే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ ప్రజల్ని హెచ్చరించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన రీసెర్చ్‌ ప్రకారం.. కరోనా వైరస్ లేదా ఫ్లూ బారిన పడిన వారు ప్రాణాలతో పోరాడాల్సి ఉంటుందని అందులో రాసి ఉంది. అంటే అంతర్లీనంగా మరో భయంకరమైన వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండాలని శాస్త్రేవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: