తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ లోకి ఇద్దరు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని కొంత మంది భావించారు. అయితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే విషయంలో వెనకడుగు వేశారని వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ముందుకు వెళ్తుందని భావించినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసహనం పెరిగిపోతోంది. ప్రధానంగా పెట్రోల్ గ్యాస్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తూ వస్తోంది. తగ్గించే విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

అందుకే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళిన పెద్దగా ఫలితం ఉండదు అని భావించి టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారట. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడం రాష్ట్రంలో నాయకత్వ సమర్థవంతంగా లేకపోవడంతో వీళ్లిద్దరు టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేకపోతే ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తే పాదయాత్ర చేయాలి అనే ఆలోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. మరి ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: