తెలంగాణలో ఇప్పుడున్న సమస్యలతో భారతీయ జనతాపార్టీ చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నది అనే విషయం అందరికి తెలిసిందే. చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు అనుకున్న విధంగా పని చేయకపోవడంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉందని సమాచారం.

బండి సంజయ్ అనుకున్న విధంగా పని చేయకపోవడం అలాగే నియోజకవర్గాల్లో తిరగకపోవడం కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఆయన విమర్శలు చేయడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని బండి సంజయ్ పెద్దగా గ్రహించలేకపోతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఆయన చేస్తున్న విమర్శలకు మీడియా వర్గాలు మంచి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి.

అయినా నియోజకవర్గ స్థాయిలో మాత్రం ముందుకు వెళ్లలేక పోతున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు నియమించుకునే విషయంలో కూడా బండి సంజయ్ అడుగులు వేయలేకపోతున్నారు. కనీసం అధిష్టానం నేతలు మాటలు కూడా ఆయన విని ముందుకు వెళ్లలేకపోతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హిందుత్వ వాదం విషయంలో బీజేపీ వెనుకడుగు వేస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ హిందువులను ముందుండి నడిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హిందువులను మేయర్, డిప్యూటి మేయర్ గా సీఎం కేసీఆర్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతసేపు ప్రసంగాలు చేయడం వల్ల ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదు. అందుకే బీజేపీ అధిష్టానం ఆయన విషయంలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: