బాలీవుడ్ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్,నటి తాప్సీ పన్ను,నిర్మాతలు మధు మంతెన,వికాస్ భల్ కార్యాలయాలు,ఇళ్లపై బుధవారం అనగా మార్చి 3 ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ సీఈవో శిభాషిష్ సర్కార్, ఎక్సీడ్ కంపెనీ సీఈవో అఫ్సర్ జైదీ,క్వాన్ కంపెనీ సీఈవో విజయ్ సుబ్రహ్మణ్యమ్ కార్యలయాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.


ఎక్సీడ్,క్వాన్... ఈ రెండూ కంపెనీలు బాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఐటీ అధికారులు ఈ ఆకస్మిక దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.సినీ పరిశ్రమలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ప్రముఖ హీరోయిన్ తాప్సితోపాటు మరో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లు, ఆస్తులపై ఈ దాడులు జరిగాయి.అయితే దీనిపై అధికారికంగా బయటకు చెప్పడం లేదు.తాజా సమాచారం ప్రకారం ముంబైలోని తాప్సికి చెందిన రెండు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించి ఈరోజు ముంబై, పూణేల్లో దాదాపు 20 నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.                                             


ఈ దాడుల్లో తాప్సితోపాటు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధు మంతెన కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అనురాగ్ ఫాంటమ్ ఫిలింస్ లావాదేవీలపై ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఇక వీరే కాదు,నిర్మాత విక్రమాదిత్య మోత్వానె, నిర్మాత వికాస్ బాల్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం.ట్విస్ట్ ఏంటంటే తాజాగా దర్శకుడు అనురాగ్ తోపాటు హీరోయిన్ తాప్సిలు రైతుల ఆందోళనకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వీరి ఇళ్లపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: