అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా అందులో రెండు ఏకగ్రీవాలు అయ్యాయి. అవి కూడా వైసీపీకి. ఇంకా ఎన్నికలు జరగాల్సిన వార్డులు 34 ఉన్నాయి. అయితే ఈ తాడిపత్రి ఎన్నికలు చాలా స్పెషల్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీ. అలానే దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న పురపాలక సంఘంగా నిలబడింది.

ఇలాంటి ఘన చరిత్ర ఉన్న మున్సిపాలిటీ లో ఇప్పుడు అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ప్రధాన రహదారులు, దుకాణాలు, ఇళ్ల ముంగిట వేల సంఖ్యలో మొక్కలు దర్శనమిస్తూ ఉండేది. కానీ కొన్నాళ్ళ నుండి అధికారుల పాలనలో ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల వచ్చే చాలా చోట్ల మొక్కలే లేకుండా పోయాయి. టీడీపీ ఛైర్మన్ ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ శుభ్రతకు పెద్ద పీట వేసేవారు.

తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులుండగా 1,30,887 జనాభా ఉంది. అందులో 74,368 ఓటర్లున్నారు. అధికారుల పాలన కాకుండా పాలకవర్గం ఏర్పడితే అన్ని సమస్యలకు పుల్ స్టాప్ పడుతుందన్న భావనలో అందరూ ఉన్నారు. ప్రజలు మాత్రం గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఆదాయ వనురులు సృష్టించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేపట్టాడని భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా కౌన్సిలర్ గా పోటీ చేస్తుండడంతో ఈసారి ఖచ్చితంగా తాడిపత్రి మునిసిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: