ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపీ నేతలు ప్రచార హోరు పెంచారు. నందమూరి కుటుంబం కూడా ఇప్పుడు ప్రచారం  చేస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ కూడా ప్రచారం కాస్త స్పీడ్ గా చేస్తున్నారు. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించారు.

రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాం అని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియా... మద్యం మాఫియా రాజ్యమేలుతున్నారు అని ఆయన విమర్శలు చేసారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయ్యింది అన్నారు. జవాబు దారి తనం వున్న పార్టీ కి ప్రజలు ఓటు వేయాలి అని ఆయన కోరారు. హిందూపురంను గత ప్రభుత్వం హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసాం అని... మట్కా.. అసాంఘిక. కార్యకలాపాలను కట్టడి చేసాం.. ఇప్పుడు ఇవన్నీ రాజ్యమేలుతున్నాయి అని ఆయన అన్నారు.

నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు అన్నారు. ఎవ్వరికీ భయపడవద్దు... హిందూపురం లో ఎవ్వరు భయపడరు అని ఆయన స్పష్టం చేసారు. రెండు సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నారు. రాష్ట్రంలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోంది అని, ఒకరు చంద్రబాబును  తిట్టడానికి ...మరొకరు లిక్కర్ మాఫియా అని అన్నారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఐఏఎస్ ఐపీఎస్ లు తమ ప్రభుత్వంలో గౌరవంగా తమ ప్రభుత్వంలో గౌరం గా ఉండే వాళ్ళు.... ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ల పరిస్థితి మారిపోయింది అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: