సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేస్తున్నా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ లో ఆగ్రహం పెరిగిపోతుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో పార్టీ అధినేత కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొంతమంది స్థానిక నేతలకు మధ్య సఖ్యత లేదు. దీనివలన రాజకీయం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం ఇప్పటివరకు దృష్టిపెట్టిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నం చేసిన నేతలకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది. దీనివలన పార్టీకి నష్టం జరుగుతుందనే భావనను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా కొంతమంది నేతలు పెద్దగా సహకరించలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి అనే విషయం చెప్పవచ్చును. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలామంది నేతలు పార్టీ కోసం పని చేయడం లేదు. నల్గొండ జిల్లాలో కూడా కొంతమంది నేతలు అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఇచ్చిన ప్రాధాన్యత ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్న వాళ్ళకి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పెద్దగా ఎవరూ కష్టపడే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన కార్యకర్తలు కూడా పార్టీ మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: