తెలంగాణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం పై స్పష్టత రావడం లేదు. తుమ్మల నాగేశ్వరావు గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసహనంగా ఉన్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు విషయంలో తెరాస అధిష్టానం కాస్త జాగ్రత్తపడే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

నాగేశ్వరరావు కారణంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో ఓడిపోయే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని అంశాలలో సిఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావుతో త్వరలోనే సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పెద్దగా తుమ్మల పాల్గొనే ప్రయత్నం చేయటంలేదు. తుమ్మల నాగేశ్వరరావు తో సన్నిహితంగా ఉన్న చాలామంది నేతలు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఆయనను ప్రగతి భవన్ కు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారట. ముందు నుంచి కూడా సీఎం కేసీఆర్ తో తుమ్మల నాగేశ్వరరావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అనుకున్న విధంగా పని చేయలేక పోవడంతో సీఎం కేసీఆర్ ఆయనతో మాట్లాడటానికి రెడీ అయ్యారట. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల నాగేశ్వరరావును టిఆర్ఎస్ పార్టీ నేతలు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో చాలామంది నేతలు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పెద్దగా పని చేయడం లేదు. ఇక హైదరాబాదులో కూడా తుమ్మల నాగేశ్వరరావుకు అభిమానులు ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: