కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మాజీ కేంద్ర మంత్రులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రులు కొంత మంది పదేపదే మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంను ఇప్పుడు మరింత వేగంగా టార్గెట్ చేస్తున్న కొంతమంది మాజీ కేంద్ర మంత్రులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు రాజంపేట ఎంపీ సీటుని చంద్రబాబు నాయుడు ఖరారు చేసే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతుంది. అలాగే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా తెలుగుదేశం నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబునాయుడు రంగంలోకి దించినట్టు గా రాజకీయవర్గాలు అంటున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనంతపురం కడప కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలతోకోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కు ముందు నుంచి కూడా సఖ్యత ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ద్వారా కొంతమందిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు ఇవ్వడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. వాళ్లను పార్టీలోకి తీసుకురావడానికి కాస్త గట్టిగానే కష్టపడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: