తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు విఫలం కావడంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త ఆలోచన మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది సీనియర్ నటులతో ఆయన ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతున్నది. రాజకీయంగా తెలంగాణలో కాస్త భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణ లో సీఎం కేసీఆర్ బలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని ఇబ్బందులు పార్టీకి వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లే విషయంలో మంత్రులు కూడా విఫలమవుతున్నారు.

అందుకే ఇప్పుడు సినీ నటుల మీద సీఎం కేసీఆర్ ఆధార పడుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఐటీ రంగాన్ని ప్రమోషన్ చేసే విషయంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫెయిల్ అయ్యారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీనటుల తో సీఎం కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారు. అక్కినేని నాగార్జున, చిరంజీవి వంటి నటులతో ఆయన ఇప్పుడు చర్చలు  జరుపుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

అక్కినేని నాగార్జున త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రచారం మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు. దగ్గుబాటి రానా కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే వీరందరితో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం అలాగే ఐటీ రంగం ప్రచారం పర్యాటక రంగం ప్రచారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించిన కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఒక సినీ గేయ రచయితతో ప్రచారం చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని త్వరలోనే దీనికిసంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలు కావచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: