శంషాబాద్ పోలిసులు సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఫేక్ జాబ్స్ పేరిట మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు అని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఫేక్ జాబ్స్ పేరిట మోసం చేయడమే కాకుండా నకిలీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు అని పేర్కొన్నారు. రైల్వే జాబ్స్ పేరిట ఫేక్ నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చారని, ట్రైనింగ్ కూడా ఇచ్చారని బాధితులు నుండి మాకు ఫిర్యాదు అందింది అని వివరించారు. రైల్వే  ఉద్యోగాల పేరుతో వందలాది  ఈ ముఠా వల్ల మోసపోయారు అని వివరించారు.

అబ్దుల్ మాజిద్, సర్వేస్ సాహు ఈ ముఠాలో కీలకంగా ఉన్నారు.  వీరిని అదుపులోకి తీసుకున్నాం.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అని తెలిపారు. ఫేస్ బుక్ లో అబ్దుల్ మాజిద్ రైల్వే జాబ్స్ పేరిట ఓ పోస్ట్ అప్లోడ్ చేసాడు అని, దింతో చాలా మంది ఔత్సాహికులు అబ్దుల్ మాజిద్ కాంటాక్ట్ అయ్యారు అని తెలిపారు. అనంతరం వారితో అబ్దుల్ మాజిద్  వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి జాబ్స్ అప్లై చేసుక్కవడానికి ఓ లింక్ పంపారు అని పేర్కొన్నారు. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకున్నాక మెడికల్ టెస్ట్ కోసం 50 వేలు తీసుకుని ఫేక్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు అన్నారు.

రైల్వే ఆసుపత్రిలో వారికి మెడికల్ టెస్టులు చేయించారు. అక్కడి హాస్పిటల్ లో ఎవరైనా నిందితులకు సహకరించారా లేదా అన్నది తేలాలని పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ పొందక  వారందరికీ నకిలీ అపాయింట్ ఆర్డర్ ఇచ్చారని, అపాయింట్ కన్నా ముందు ట్రైనింగ్ అవ్వాలని  ఒక్కొక్కరి నుండి మూడు లక్షల రూపాయల వసూలు చేశారు అని వివరించారు. రెండు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి  వందలాది మందికి ట్రైన్నప్ చేశారు.. గత మూడు సంవత్సరాలుగా ఈ వ్వ్యవహారం నడుస్తోంది అన్నారు. ట్రైనింగ్ లో ఎవరిని కూడా ఫోన్ ఆలో చేసేవారు కాదు అని పేర్కొన్నారు. ట్రైనింగ్ అయ్యాక అభ్యర్థులకు  నకిలీ ఐడి కార్డు లతో పాటు, నకిలీ అపాయింట్ ఆర్డర్ లను ఇస్తారు అని వివరించారు. ఆర్డర్స్  పొందాక జాబ్ రిపోర్టింగ్ కోసం వెళ్లినవారికి అక్కడి అధికారులు ఇది ఫేక్ ఆర్డర్స్ అని చెప్తారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: