ఆంధ్రప్రదేశ్ లో బిజెపి నుంచి ఒకరిద్దరు నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ముందు నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా కొంతమంది కీలక నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ మేరకు ఆయన విశాఖ జిల్లాలో కొంత మంది తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తో ఆయన చర్చలు జరిపారని ఆయన కూడా రావడానికి అంగీకరించారు అని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మరో నేత కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. కామినేని శ్రీనివాస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కీలక నేత ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కైకలూరు నియోజకవర్గం నుంచి 2014 లో ఆయన విజయం సాధించారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అదే నియోజకవర్గం నుంచి సీటు ఖరారు చేస్తామని బిజెపి నేతలు చెప్పిన సరే ఆయన మాత్రం ఇప్పుడు ఆ పార్టీలో ఉండడం వల్ల తాను గెలిచే అవకాశం లేదని అందుకే తెలుగుదేశం పార్టీలో కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా అని బిజెపి నేతలకు కూడా స్పష్టం చేశారు. అయితే ఆయనను అడ్డుకోడానికి సుజనాచౌదరి ప్రయత్నం చేసినా సరే పెద్దగా లాభంలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: