మనకు తెలిసినంత వరకు సర్వ సాధారణంగా మనుషుల కొట్లాట, రెండు జంతువుల మధ్య కొట్లాట చూసి ఉంటారు. అయితే ఇక రెండు జంతువుల మధ్య ప్రేమ వీడియోలు కూడా సర్వసాధారణమే. ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా ఆకోవలోకే వస్తుంది పాముల సయ్యాటను అందరూ చూసే ఉంటారు.. కానీ రెండు పాములు భయంకరంగా పోట్లాడుకోవడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు కదా. రెండు పాములు భీకరంగా పోరాటం చేసుకుంటున్నాయి.

మనం పామును చూడగానే అది ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో పరుగుడుతాము. అలాంటిది ఏకంగా రెండు పాములు ఒకదానిని ఒకటి మెలేసుకుని ముష్టియుద్ధం చేస్తున్నాయి. ఇందులో శాంట్ బువా అనే పాముతో నాలుగు అడుగు పొడవైన నాగుపాము పోట్లాటకు దిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు పాములు ఎక్కడ కొట్టుకున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ గల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. నిజానికి పాము కనిపిస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తాం.. అలాంటిది ఇక్కడ రెండు భారీ పాములు ఒక్కచోట చేరి, భీకరంగా పోట్లాడుకుంటున్నాయి.

అయితే వీటిలో ఒకటి విషం లేని శాంట్ బువా పాము, మరొకటి నాలుగు అడుగుల స్పెక్టకాల్డ్‌ కోబ్రా. ఈ రెండు పాములు కూడా ఒకదానికొకటి చుట్టుకొని బుసలు కొడుతూ భీకరంగా కొట్టుకున్నాయి. అయితే ఈ సీన్‌ చూసిన అక్కడి స్థానికులు స్నేక్‌ సోసైటీ వారికి సమాచారం అందించారు. దాంతో వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పాములను విడదీశారు. తర్వాత వాటిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు పోరాడుతున్న సమయంలో ఎవరో తమ ఫోన్ కు పనిచెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: