దేశ వ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ని కట్టడి చేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కొన్ని కొన్ని అంశాలలో బీజేపీని ఇబ్బంది పెట్టలేకపోతుంది అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రధానంగా బలమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందికి సహకారం రావటం లేదు. మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో పెద్దగా సహకరించిన పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

బీహార్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ అలసత్వమే అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సహకరించిన పరిస్థితులు లేవు. ఆర్జేడీ  యువనేత తేజస్వి యాదవ్ ప్రజల్లోకి బలంగా వెళుతున్న సరే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం పెద్దగా ఎవరూ సహకరించే ప్రయత్నం చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొంతమంది విహార యాత్రకు వెళ్లారు అని ఆరోపణలు వినిపించాయి.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్  లో   ఆమె ఎక్కువగా తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీహార్ లో కూడా రాహుల్ గాంధీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను కీలక నేతకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక పవనాలు ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలి అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన వాళ్లకు కొన్ని సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద కూడా రాహుల్ గాంధీ కాస్త గట్టిగానే దృష్టి పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: