బ్లూ బెర్రీస్ గురించి చాల మందికి తెలీదు. కానీ బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాల మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. బ్లూ బెర్రీస్‌, వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

అంతేకాదు.. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ ‘ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌’, ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని, జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు. గతంలో, బ్లూ బెర్రీస్‌ మేసిన జంతువుల మీద జరిపిన పరిశోధనల ఆధారంగా, వయోజనులలో జ్ఞాపకశక్తి పెరగడానికి బ్లూ బెర్రీస్‌ తోడ్పడతాయని, ఇటీవల జరిపిన అధ్యయన కర్త, రాబర్ట్‌క్రికోరియన్‌ తెలియజేస్తున్నారు. ఆయన తమ సహాధ్యాయులతో సహా, ఎన్నో సంస్థల అండదండలతో, యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటీలో ఈ పరిశోధన నిర్వహించారు.

అయితే 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల మీద బ్లూబెర్రీస్‌ జ్యూస్‌ ప్రభావం గురించి, క్రికోరియన్‌, ఆయన బృందం, అసంఖ్యాకమైన పరీక్షలు జరిపారు. అధ్యయన కాలంలో, ఈ స్టడీగ్రూప్‌లోని వృద్ధులు, 2 నుంచి 2 1/2 కప్పుల బ్లూ బెర్రీ రసం సేవించారు. ‘కంట్రోల్‌ గ్రూప్‌’గా రూపొందిన మరో బృందం, రెండు నెలల పాటు, రోజూ, మరొక ‘పానీయం’ సేవించారు. కానీ, ‘బ్లూ బెర్రీ జ్యూస్‌’ తీసుకున్న వయోవృద్ధులలో, జ్ఞాపకశక్తి బాగా పెరిగింది.

ఇక ఈ ప్రయోగాల ఫలితాలు ఎంతో, ఆశా జనకంగా వుండడంతో, ‘న్యూరో డిజెనరేషన్‌’ నిరోధించడానికి, బ్లూ బెర్రీస్‌ ఎంతగానో ఉపకరిస్తాయనే నిర్ణయానికి వచ్చాంఅన్నారు. రాబర్ట్‌ క్రికోరియన్‌. బ్లూ బెర్రీస్ వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు , అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంమరియు పీచు పదార్థము ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: