ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తుంటారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసు కూడా ఎత్తరు. అలాగని ప్రైవేట్ వ్యక్తులు ఎవరు రారు. కానీ ఉన్న పోర్ట్ లు చేతులు మారి పోతుంటే ఏం చేయాలి. ఇప్పటికే కృష్ణపట్నం ఓట్లను కొనుగోలు చేసిన మోడీ సన్నిహితుడు తాజాగా గంగవరం పోర్టును కొంటున్నట్టు సమాచారం. దీంతోపాటు భావన పాడు పోర్టు కూడా అతనికి ఇవ్వాలి అని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏమిటీ? ఈ విషయం గురించి తెలుసుకుందాం.


ఇప్పటికే ఏపీలో ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని తీర ప్రాంత పోర్టులను మోడీ సన్నిహితుడు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారుతోంది. మోడీ సన్నిహితుడైన అతనిది ప్రధానంగా పోర్టులు.. ఎయిర్‌పోర్టుల వ్యాపారం. పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు.


చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అతని చేతుల్లోకి వెళ్లిపోయింది.దీంతో ఆయన మరికొన్ని పోర్టులపై గురి పెట్టారు. జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ద్వారా లీజ్ ఇచ్చే విధానంలో అతనికే అప్పగించారు. భారత ప్రభుత్వం రైళ్లను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది. వీటిలోనూ ఆయన ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాల చేతుల్లో ఉండాల్సిందేనన్న గట్టి అభిప్రాయాలు వినిపించే పోర్టులు.. ఎయిర్‌పోర్టులు.. రైళ్లు వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడులను విపరీతంగా ఆహ్వానించడం  అదీ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామిక వేత్తలకు అగ్రతాంబూలం వేస్తుండడం చర్చకు దారితీస్తున్నాయి.

వాటాలు అమ్మకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలు భయపడి అతనికి ఆస్తులు అప్పగించేస్తున్నారు. కొద్ది రోజుల కిందట  జీవీ కృష్ణారెడ్డికి చెందిన ఆస్తులపై సీబీఐ, ఈడీ దాడులు చేసింది. దానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు. అందులో వాటాలు మోడీ సన్నిహితుడికి అమ్మడానికి ఆయన నిరాకరించారు. దాడులు జరిగాయి. తర్వాత జీవీ కృష్ణారెడ్డి వాటాలను తప్పనసరి పరిస్థితిలో అతనికే అప్పగించాల్సి వచ్చింది. దాంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. అన్ని చోట్లా ఇదే తరహా డీలింగ్స్ నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: