ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా  పెరిగిపోయాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొట్టడంతో ప్రస్తుతం సామాన్య ప్రజల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఇప్పటికే కరోనా  వైరస్ కారణంగా ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు  ఇప్పుడూ పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో..  దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో మొన్నటివరకు ఎంతో స్టైల్ గా ఉండే వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఇక ఇప్పుడు మైలేజ్ ఇచ్చే బైక్ పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.



 అయితే ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల స్థాయిలో బైకులు వస్తున్నప్పటికీ మైలేజ్ ఇచ్చే బైక్స్ మాత్రం చాలా తక్కువగానే వస్తు న్నాయి  అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో రోజుల నుంచి ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్ మహారాజుగా.. కొనసాగుతూ ఎంతోమందికి ఉపయోగపడుతున్న బైక్ ఏది అంటే ప్లాటిన అని అందరూ టక్కున చెప్పేస్తారు.  అయితే అటు ఈ మధ్య కాలంలో అన్ని రకాల బైక్ తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీతో కూడిన బైక్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మైలేజ్ కావాలనుకునే వారికి మైలేజ్ స్టైల్ కావాలనుకునే వారికి స్టైల్ అన్న విధంగా బజాజ్ కొత్త బైక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.



 ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్ కి రారాజు గా కొనసాగుతున్న ప్లాటినా కు కొత్త ఫీచర్స్ జోడించింది బజాజ్ కంపెనీ.  ప్లాటినా 110  పేరుతో మార్కెట్లోకి సరికొత్తఫీచర్లతో కూడిన బైక్ తీసుకొచ్చింది. 115 సీతో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ కి యాంటీ లాక్  బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండటం గమనార్హం.  ఎల్ఇడి లైట్ తో పాటు ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్లాంటిన యొక్క ధర 65 వేల రెండు వందల తొంభై రూపాయలు ఎక్స్ షోరూం ధర గా ఉంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఎంతో మంది ఇలాంటి బైక్ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: