సీఎం కేసీఆర్‌.. స్టయిలే వేరు.. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ఎదుటి వ్యక్తిలో టాలెంట్‌ గుర్తిస్తారు. పనితనాన్ని ప్రోత్సహిస్తారు.. ఈ విషయాన్ని ఆయన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి విషయంలో మరోసారి నిరూపించారు. సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసే ఆనంద్ సాయి.. ఇప్పుడు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. యాదాద్రికి కొత్త రూపు తీసుకొచ్చిన కీలక వ్యక్తి ఆనంద్‌ సాయి.

ఆనంద్‌ సాయి.. ఎవడు సినిమాకు పని చేసిన తర్వాత ఆయనకు చిన్నజీయర్‌ స్వామివారి నుంచి పిలుపొచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఆయన ఆశ్రమం ప్రాజెక్టు డిజైన్లు చేయమని చెప్పారు. ఆనంద్ సాయి అక్కడే కొన్ని గంటల్లో డ్రాయింగ్స్‌ గీసి ఇచ్చా. అవి చూసిన ఆయన ఆ ప్రాజెక్టు ఆనంద్‌ నే చేయమన్నారు చినజీయర్ స్వామి. అలా చినజీయర్‌ స్వామివారితో కలిసి రెండున్నరేళ్లు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగారు ఆనంద్ సాయి.


ఆ సమయంలోనే ఆనంద్ సాయికి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. యాదాద్రి టెంపుల్‌కు వర్క్‌ చేయాలని చెప్పారు. సీఎంగారిని కలిసే ముందే రోజే కొన్ని డిజైన్లు గీసుకున్నారు ఆనంద్ సాయి. వాటిని చూపించాక సీఎం కేసీఆర్ నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి, మీరు యాదాద్రిని డిజైన్‌ చేయండి’ అని కోరారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొదలుపెట్టి మొత్తం 4 వేల డిజైన్స్‌ ఇచ్చారు ఆనంద్‌ సాయి. దాదాపు ఐదేళ్ల కృషి తరవాత ఇప్పుడు యాదాద్రి ఆలయం మేలో మళ్లీ ప్రారంభం కాబోతోంది.

ఈ ఐదేళ్లలో సీఎం కేసీఆర్ ఆనంద్‌సాయిని చాలాసార్లు సీఎంగారు నన్ను అభినందించారట. క్యాంప్‌ ఆఫీస్‌లో ఆయనతో మీటింగ్‌ జరిగినప్పుడు అక్కడికక్కడే ఆయన ఆలోచనలకు తగ్గట్టు డ్రాయింగ్‌ గీసి ఇచ్చేవారట ఆనంద్ సాయి.  కేసీఆర్‌గారు నాకొక దేవుడిలాగా అనిపిస్తారు అంటారు ఆనంద్ సాయి. ఎందుకంటే యాదాద్రి మొత్తం స్టోన్‌తోనే నిర్మించారట.  సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీ పడకుండా సహకరించారట. చినజీయర్‌స్వామివారు, ఆనంద్ సాయికి అన్నివేళలా సరైన సూచనలు ఇస్తూ ఒక మహత్‌ కార్యాన్ని పూర్తి చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: