ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరికీ సర్వసాధారణంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే.. అయితే కొంతమందికి  అయితే జుట్టురాలే సమస్య మరింత వేగవంతమై ఏకంగా పెళ్లి జరిగే సమయానికి పూర్తిగా తలపై జుట్టు రాలిపోయి బట్టతల రావడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువకులు తలపై జుట్టు ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతూ  ఉండడం.. అలాంటి వారిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ ఉండటం కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 ఈ క్రమంలోనే తలపై జుట్టు లేకపోయినప్పటికీ ఇక విగ్ పెట్టుకొని కవర్ చేస్తూ ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే నిజాన్ని మాత్రం ఎక్కువ రోజులు దాయలేక చివరికి భార్య  దగ్గర దొరికిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా  ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్ళిలో  తన భర్తకు మంచి క్రాఫ్  ఉందని మురిసిపోయింది భార్య. కొన్నాళ్ళకి అసలు నిజాలు బయట పడడంతో షాక్ అయ్యింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. తన భర్త వెంట్రుకలు లేకపోయినప్పటికీ విగ్  పెట్టుకొని తనను మోసం చేశాడంటూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది.



 పెళ్లి చేసుకున్న సమయంలో తన భర్త కు ముందుగా జుట్టు ఉందని.. ఇక అతని జుట్టు చూసే అతడితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అంటు సదరు మహిళ చెప్పింది. అయితే తన స్నేహితురాలు దగ్గర కూడా తన భర్త గురించి గొప్పగా చెప్పుకున్నానని  కానీ ఇప్పుడు అసలు జుట్టు  నిజమైనది కాదు అని తెలిసి తట్టుకోలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. బట్టతల ఉన్నప్పటికీ విగ్  పెట్టుకొని తన భర్త తనను మోసం చేశాడని.. ఇప్పుడూ తన స్నేహితుల ముందు తాను తల ఎత్తు కోలేక పోతున్నాను అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తనకు భర్తతో విడాకులు ఇప్పించాలి అంటూ లాయర్ ను  సంప్రదించింది  ఆ ఇల్లాలు. బంధువులు కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నం  చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: