ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందంటే మాత్రం కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలకు సహకరించడం లేదనే ఆవేదన వ్యక్తం అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాలేదు అని ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పెద్దగా సహకరించే ప్రయత్నం చేయటం లేదు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించడం లేదు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనకు సహకరించే ప్రయత్నం చేయటం లేదు. అలాగే నల్గొండ జిల్లాలో కూడా మంత్రి జగదీష్ రెడ్డి విషయంలో ఇలాగే జరుగుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి 2014 నుంచి 2018 వరకు మంత్రిగా ఉన్నారు. మళ్ళీ 2018 తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం పై ఇప్పుడు నల్గొండ జిల్లా నేతలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆయనకు కొంతమంది నేతలు సహకరించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పెద్దగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. దీని వలన కార్యకర్తలు కూడా దూరమవుతున్నారు. మంత్రులకు ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో చాలా మంది మంత్రులు ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి దీనిని టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ఎదుర్కొని ఎలా నిలబడుతుంది ఏంటి అనేది చూడాలి. ఈ పరిస్థితులను సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: