ఏపీలో ప‌ట్ట‌ణ‌పోరులో ప‌లు కంచుకోట‌ల్లో పోటీ చేసేందుకు కూడా టీడీపీకి క్యాండెట్లు లేరు. అనంత‌పురం జిల్లాలో ధ‌ర్మ‌వ‌రం అంటేనే టీడీపీకి పెట్ట‌ని కోట‌. వైఎస్ ప్ర‌భంజ‌నంలోనూ 2004లో ఇక్క‌డ టీడీపీ విజ‌యం సాధించింది. బీసీల జ‌నాభా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా ఎక్కువ‌. ధ‌ర్మ‌వ‌రం టౌన్లో అయితే బీసీల జ‌నాభా... అందులోనూ చేనేత‌లు బాగా ఎక్కువ‌గా ఉంటారు. వీరంతా టీడీపీకి పెట్ట‌ని కోట‌గా ఉంటూ వ‌స్తున్నారు. ధ‌ర్మ‌వ‌రం టౌన్ ఎప్పుడూ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. అలాంటి ధ‌ర్మ‌వ‌రం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు దాఖ‌లు కాలేదంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ధ‌ర్మ‌వ‌రం టౌన్లో ఉన్న 40 వార్డులకు గానూ టీడీపీ పోటీలో ఉన్న‌ది కేవ‌లం 30 వార్డుల్లోనే..! అంటే 10 వార్డుల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్ట‌లేక‌పోయింది. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక‌ బీజేపీలో చేరిపోయాడు. ఆ త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను ప‌రిటాల ఫ్యామిలీకి ఇచ్చింది తెలుగుదేశం అధిష్టానం. అయితే శ్రీరామ్‌, సునీత‌ల్లో ఎవ‌రో ధ‌ర్మ‌వ‌రం, ఎవ‌రు రాఫ్తాడులో పోటీ చేస్తారో తేల్చుకోవాల‌ని బాబే ఆప్ష‌న్ ఇచ్చారు. అయితే ఆ ఫ్యామిలీ ధ‌ర్మ‌వ‌రం వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌ట్టుగా ఉంది.

ట్విస్ట్ ఏంటంటే... ఈ 40 వార్డుల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మీటింగ్ అంటూ పిలిచి నామినేష‌న్లు వేయించారు. ఆ త‌ర్వాత కొంద‌రు ఇదేంటి చెప్మా అంటూ త‌మ నామినేష‌న్లు గ‌డువులోగా కొందరు ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో ప‌ది వార్డులు ఏక‌గ్రీవం అయ్యాయి. మిగ‌తా వార్డుల్లో మాత్రం పోటీ కొన‌సాగుతూ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎప్పుడూ టీడీపీ గ‌ట్టి పోటీ ఇస్తుంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ ధ‌ర్మ‌వ‌రం టౌన్లో టీడీపీకి మంచి ఓట్లు ప‌డ్డాయి. అలాంటి చోట ఇప్పుడు పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేని దుస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: