ఏపీలో టీడీపీ పుర పోరులో ముందే చేతులు ఎత్తేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే పార్టీకి ప‌ట్టున్న విజ‌య‌వాడ లాంటి చోట్లే ఏటికి ఎదురీదుతోంది. అక్క‌డే ఇలా ఉంటే ఇక పార్టీకి ఏ మాత్రం ప‌ట్టే లేకుండా 25 ఏళ్లుగా పార్టీ గెల‌వ‌ని చోట ఇంకెంత దుస్థితి ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. గుంటూరు న‌గ‌రంలో గుంటూరు తూర్పులో టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ఇక్క‌డ‌1999 నుంచి పార్టీ గెలిచింది లేదు. వ‌ర‌సుగా నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయింది. 2009లో లాల్ జాన్ భాషా సోద‌రుడు జియావుద్దీన్ భ‌యంక‌రంగా ఓడిపోవ‌డంతో పాటు మూడో స్థానంలో నిల‌వ‌డంతో చంద్రబాబు ఆ కుటుంబాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టేశారు.

2014లో ముస్లింల‌కు కాకుండా వైశ్య వ‌ర్గానికి చెందిన మ‌ద్దాలి గిరికి సీటు ఇవ్వ‌గా ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో తిరిగి మైనార్టీల‌కే సీటు ఇచ్చారు. మ‌హ్మ‌ద్ న‌సీర్‌కు సీటు ఇవ్వ‌గా ఆయ‌న ఓడిపోయారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల‌కు ముందే న‌సీర్‌కు చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌గా.. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని పటిష్టం చేసే దిశ‌గా ప్లానింగే వేయ‌లేదు. ఇక ఇక్క‌డ వైసీపీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ముస్త‌ఫాకు మంచి పేరు ఉంది.

పైగా కేబినెట్ మార్పుల్లో అయినా మంత్రి ప‌ద‌వి రాదా ? అన్న ఆశ‌తో ఆయ‌న ఉన్నారు. ఇక టీడీపీ ఇన్ చార్జ్‌గా ఉన్న న‌సీర్  ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తేనా ? అన్న సందేహాలు జిల్లా పార్టీ నేత‌ల‌కే ఉన్నాయి. 25 ఏళ్లుగా పార్టీకి ఏ మాత్రం ఆశ‌ల్లేని తూర్పులో రేప‌టి కార్పొరేష‌న్ ఎన్నికల్లో అయినా టీడీపీ ఏదో సాధిస్తుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: