కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్పీడ్  పెంచాయి. కేరళలో పాగా వేయాలని చూస్తున కమలదళం.. ఈసారి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికల ప్రచారంలో కేరళ బీజేపీ నేతలు హామీల వర్షం గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్‌‌ను రూ.60కే అందిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ అన్నారు. కొచ్చిలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో రాజశేఖరన్ ఈ హామీ ఇచ్చారు. బీజేపీ పవర్‌లోకి వస్తే పెట్రోల్, డీజిల్‌‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని, అప్పుడు చమురు ధరలు రూ.60 లోపే ఉంటాయని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రాష్ట్రంలోని అధికార ఎల్డీఎఫ్‌‌ను ప్రశ్నించారు.

కేరళలో బీజేపీకి ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులే ఖరారు కాలేదు. అందరికంటే ముందు సీఎం అభ్యర్థి మాత్రం డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ మెట్రో మేన్ గా దేశమంతా సుపరిచితమైన శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు.శ్రీధరనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టే.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది పార్టీ. గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని శ్రీధరన్ చెప్పారు. నిజానికి బీజేపీ ఎప్పుడు ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ఖరారు చేయదు. కాని కేరళలో మాత్రం శ్రీధరన్  పేరును ముందే ప్రకటించింది.శ్రీధరన్ ముందుండి నడిపిస్తే.. ఆశాజనక ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశిస్తోంది.
 
శ్రీధరన్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొచ్చి అర్బన్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజధాని నుంచి బరిలో దిగితే.. యావత్ రాష్ట్రంపై ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలేస్తోంది కమలదళం.

గతంలో ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని సీఎం కేండిడేట్ గా ప్రకటించి ఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు కేరళలోనూ శ్రీధరన్ తో ఢిల్లీ తరహా ఎక్స్ పర్మెంట్ చేస్తోంది. LDF, UDF కూటములు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఎలాగూ గెలిచే అవకాశం లేని చోట మాత్రమే.. బీజేపీ కిరణ్ బేడీ, శ్రీధరన్ లాంటి మిస్టర్ క్లీన్ లను ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తూ.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంటుందనే ఆరోపణ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: