ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారూ  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు  కూడా ఎన్నో రకాల సేవలను పొందుతున్నారు. ఇక నేటి రోజుల్లో అన్ని రకాల బ్యాంకులు కూడా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వినూత్నమైన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు ముందు ఉంటున్నాయి  అన్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకునేలా ఎంతో వినూత్న సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు బ్యాంకుకు వెళితే గానీ ఏ పని జరిగేది కాదు కానీ నేటి రోజుల్లో మాత్రం ఇంట్లో ఉండే ఎన్నో రకాల బ్యాంకు కార్యకలాపాలను చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ వినూత్న సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి ఆయా బ్యాంకులు. అయితే ఈ మధ్య కాలంలో అన్ని బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని తెలుసుకునేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది అంటూ సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక ఇటీవలే ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తాజాగా తమ కస్టమర్లకు ఇలాంటి తరహా సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.



 రెండు కొత్త నెంబర్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక ఈ కొత్త నెంబర్లు ప్రతిరోజు 24 గంటల పాటు ఖాతాదారులకు అందుబాటులో ఉండనున్నాయి.  ఇక ఈ బ్యాంకు యొక్క ఖాతాదారులు ఈ నంబర్లకు కాల్ చేసి బ్యాంకు సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. మీ అకౌంట్ కి అనుసంధానం అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి 84680-01111 నెంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలిసిపోతుంది. ఇక మినీ స్టేట్మెంట్ కోసం 84680 01122 నెంబర్ కు  మిస్సేడ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇలా కస్టమర్లకు సులభతరమైన సర్వీసులు అందించేందుకు రెండు రకాల కొత్త నెంబర్లను  అందుబాటులోకి తీసుకొచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా.

మరింత సమాచారం తెలుసుకోండి: