బెజవాడ మేయర్ ఎన్నికల్లో మేయర్ ఎవరన్నది అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ లలో ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్ గా నెలకొంది. టిడిపి నుంచి ఎంపీ కేశినేని నాని తన కుమార్తె శ్వేత‌ను త‌న‌కు తానే మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్రకటించుకుంటున్నారు. అయితే మిగిలిన టిడిపి నేతలు మాత్రం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళా నేత ను కార్పొరేటర్ గా ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తన నియోజకవర్గానికి మేయ‌ర్‌ దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే అధికార వైసీపీలో బెజవాడ మేయర్ పదవి కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారని ఆశలు పెట్టుకున్న నేతలకు జగన్ షాక్ ఇస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే గుంటూరు మేయ‌ర్ ప‌ద‌వి కాపు వర్గానికి చెందిన కావ‌టి మనోహర్ నాయుడు కు దాదాపు ఇచ్చినట్టు తెలుస్తోంది. బెజవాడ మేయ‌ర్ ప‌ద‌విని జగన్ రెడ్డి లేదా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలకు ఇస్తారంటుండ‌గా... వారి పేర్లు బ‌య‌ట‌కు వస్తున్నాయి. మంత్రి వెల్లంపల్లి చైతన్య రెడ్డి అనే మహిళను తెరమీదకు తెస్తుండ గా ... జగన్ బంధువు అయిన గౌతంరెడ్డి తన కుమార్తెను మేయ‌ర్ గా చేసేందుకు పావులు కదుపుతున్నారు.

ఇక గత కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన పుణ్యశీల విష‌యంలో జగన్ సుముఖంగా ఉన్నార‌ని మరో ప్రచారం జరుగుతోంది .ఏదేమైనా అధికార పార్టీ మేయ‌ర్‌ విషయంలో కమ్మ‌ల‌కు షాక్ ఇచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. రాజ‌ధానిలో ఉన్న రెండుకీల‌క మేయ‌ర్ ప‌ద‌వుల్లో గుంటూరు కాపుల‌కు ఇస్తుండ‌గా... ఇది విజ‌య‌వాడ కూడా క‌మ్మ‌ల‌కు ఇవ్వ‌క‌పోతే ఆ వ‌ర్గానికి వైసీపీలో ఎదురు దెబ్బే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: