ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతి ఒక్కరూ  ఉరుకుల పరుగుల జీవితంలో.. టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నారు.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు  అన్న  విషయం తెలిసిందే.  అదే సమయంలో ప్రస్తుతం అటుజంతు మంచి చదువులు చదివినప్పటికీ  ఉద్యోగాల విషయంలో మాత్రం భారీగానే పోటీ నెలకొంది.  ఇక ఉద్యోగాలు సంపాదించేందుకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ కంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలని భావించి పెద్ద పెద్ద చదువులు చదివినా  కొన్ని కొన్ని ప్రత్యేకమైన కోర్సుల్లో శిక్షణ తీసుకొని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా ఉద్యోగం సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నది నేటి రోజుల్లో ఇదే.  ఎంత బాగా చదివినప్పటికీ ఏదో ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటే తప్ప ఉద్యోగం ఇవ్వడం లేదు కంపెనీలు. ఈ క్రమంలోనే బాగా చదివినప్పటికీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఒక ప్రత్యేకమైన కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు ఎంతోమంది.  కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగం ఏదో ఒక కోర్సులో శిక్షణ తీసుకోవడం కాదు ఏకంగా ఎవరూ చేయని పని చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉద్యోగం దొరకడం లేదు అన్న కారణంతో ఏకంగా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి.


 అయితే యువకుడు ఉద్యోగం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వెనుక కారణం కూడా పెద్దదే ఉంది. వియత్నాం లో ఈ ఘటన చోటు చేసుకుంది.  వియత్నాం కు చెందిన 26 ఏళ్ల యువకుడుఎన్నో  ఇంటర్వ్యూలకు తిరిగాడు. అయితే క్వాలిఫికేషన్ ప్రకారం అంతా బాగానే ఉన్నప్పటికీ తన ముఖం చూసి మాత్రం ఎవరు ఉద్యోగం లేదు అన్న విషయాన్ని గ్రహించి ఎంతగానో బాధ పడ్డాడు ఈ క్రమంలోనే ఏకంగా తొమ్మిది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. దీని కోసం ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.  ఇదంతా కాన్ఫిడెన్స్ కోసమే అంటున్నాడు ఆ యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: