మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కర్నూల్ నుంచి ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే కర్నూల్ లో ఆయనకు రాజధాని సెగ తగిలింది. కర్నూలు పెద్ద మార్కెట్ దగ్గర.. టీడీపీ అభ్యర్థుల తరుపున చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. భారీగా వచ్చిన న్యాయవాదులు చంద్రబా మీటింగ్ కు అడ్డుపడ్డారు.హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలిపిన తరువాత ఆయన ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టుకు ఆమోదం తెలపకుండా ప్రచారం నిర్వహిస్తే ముందుకు కదలనివ్వం అంటూ అడ్డుకున్నారు. న్యాయవాదులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పెద్దమార్కెట్‌ వద్ద  కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

న్యాయవాదులను అక్కడి నుంచి పోలీసులు పంపించివేసిన తరువాత చంద్రబాబు రోడ్ షో కొనసాగింది.
చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ డైరెక్షన్ లోనే... కొంత మంది లాయర్లు చంద్రబాబు ప్రచారంలో అలజడి స్పష్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కర్నూల్ టీడీపీ నేతలు మండిపడ్డారు.

కర్నూలులో ప్రచారంలో సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ పాలనలో పూర్తిగా మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన అని, బీ అంటే బాదుడని.. సీ అవినీతి అని, డీ అంటే విధ్వంసంమని కొత్త అర్థం చేప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: