ఏపి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాకా కడప జిల్లా లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్నా మొన్నా వరకు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. అనుకున్న విధంగానే ఏకగ్రీవాల వైపు కొందరు నేతలు మొగ్గు చూపారు. మరి కొన్ని నియోజక వర్గాల్లో అధికార పార్టీ ఇస్తున్న డబ్బులకు లొంగీ బరిలోంచి తప్పుకున్నారు. కపడ లో టీడీపీ జెండా ఎక్కడా ఎగిరినట్లు కనిపించలేదు. ప్రస్తుతం జిల్లాలో  పుర పోరుకు పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జిల్లాలో వైకాపా, బీజేపి ల హవా నడుస్తుంది.


అయితే , బీజేపి నేతలు మాత్రం వైసీపీ దౌర్జన్యాలకు కాలు రువ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. నామినేషన్ల నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూనే వచ్చారని భాజపా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు బాలకృష్ణయాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు...


నగరం లో 14 మంది భాజపా అభ్యర్థులు బరి లో ఉండగా, ఆరుగురిని వివిధ రకాల ప్రలోభాలకు, భయ భ్రాంతులకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరణ చేయించారని పేర్కొన్నారు. వైకాపా నాయకులు అవలంభిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయితే పాలన అంత సజావుగా ఉండదన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా ఆర్వోలు నోటీసు బోర్డులో పెట్టలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. కడపలో 23 డివిజన్లు ఏకగ్రీవం కావడమంటే మేయర్‌ అభ్యర్థి ఎన్నిక జరిగినట్లేనన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాజపా నాయకులు లక్ష్మణ్‌రావు, బొమ్మన విజయ్‌, హరినారాయణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మరి కడపలో వైసీపీ వర్సెస్ బీజేపి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే వైసీపీ జెండా ఎగురుతుందనీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: