ఏపిలో ఎక్కడ చూసినా టెన్షన్ .. టెన్షన్.. పుర పాలక ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుంది. గత రెండు రోజులు గా రాష్ట్ర వ్యాప్తంగా మరో టెన్షన్.. నామా పత్రాల ఉపసంహరణ, ఏకగ్రీవాలు..అనుకున్న విధంగా వైసీపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో సీన్ ఇక్కడ కొనసాగుతుంది. అధికార పార్టీ నేతలు అభ్యర్థులను ప్రలోబాలకు గురిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒప్పుకొని వారితో బుజ్జగింపులు చేస్తున్నారు. కాదని మొండికేసిన వారి పై దాడులు చేస్తున్నారు.


ఇప్పటికే పలు జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాల కు పాల్పడుతున్నారు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్ ఈసీ చూపించిన శ్రద్ద ఈ ఎన్నికల పై చూపించలేదని సదరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తో కుమ్మక్కయ్యారు అనే ఆరోపణలు కూడా ఎదురవుతున్న నిమ్మగడ్డ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా.. మున్సిపల్ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే అన్ని పార్టీలు నామినేషన్లు వేశాయి.


ఇక వైసీపీ అత్యధిక ఏకగ్రీవాలను తన ఖాతా లో వేసుకుంది. మూడు మున్సిపాలిటిలో మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల జరిగిన సంఘటనల పై టీడీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?. ప్రతిపక్షాల అభ్యర్థులను బలవంతంగా ఎందుకు విత్ డ్రా చేయిస్తోంది?. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని వైసీపీ భయపడుతోందా? వైసీపీ ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. అయిన ఎన్నికల కమీషన్ ఎందుకు మౌనం వహిస్తుంది అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎన్నికల ఫలితాలు చేప్తాయా? లేదా అనేది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: