అసలు కరోనా తగ్గిందనుకుంటుంటే ఇప్పుడు కొసరు కరోనాలు వేధిస్తున్నాయి. కొత్త రకం కరోనా స్ట్రయిన్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని మరింత వేగంగా విస్తరిస్తూ హడలెత్తిస్తున్నాయి. అమెజాన్‌ అడవుల్లో పుట్టిన పీ1 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోంది. టీకాలు వచ్చినా అక్కడ వరసగా రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 1,910 మంది వైరస్‌కి బలయ్యారు. మొత్తంగా మరణాల పరంగా ఆ దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం ఇప్పటికే బ్రెజిల్‌లో 2,59,402 మంది ప్రాణాలు వదిలారు.

బ్రెజిల్‌లో మొత్తం 27 రాష్ట్రాలున్నాయి. 17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా తన ఉనికిని చాటుతోంది. అసలు దానికి కంటే ఈ ఉత్పరివర్తన చెందిన రకం వేగంగా వ్యాపిస్తోంది. మొదటి నుంచి కూడా కరోనాను నియంత్రించే విషయంలో బ్రెజిల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బొల్సొ నారో వైరస్‌ను నిర్లక్ష్యం చేసి, నిపుణుల సూచనలు ఖాతరు చేయకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.  సెలవులు, కార్నివాల్స్ వంటి కారణాలతో ఇప్పుడు అక్కడ కరోనా రెచ్చిపోతోంది.

ఇప్పుడు బ్రెజిల్ లో కరోనా ఏ స్థాయిలో ఉందంటే.. ఆ దేశంలోని 19 రాష్ట్రాల్లో ఐసీయూలు 80 శాతానికి పైగా నిండిపోయాయి. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి పోతున్నాయి. ఆసుపత్రుల్లో ఖాళీలు లేక రోగులను ఇతర ప్రాంతాలకు పంపించేస్తున్నారు. చివరకు అక్కడ వైద్య వ్యవస్థ కూడా కుప్ప కూలే స్థితికి చేరుకుంది.


మరి బ్రెజిల్‌లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఎందుకు ఇలా తయారైంది.. ఎందుకంటే.. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఆ దేశంలో వాక్సినేషన్ చాలా లేటైంది. ఆ దేశానికి టీకాల సరఫరా కూడా లేదు. పరిస్థితి ఇలా ఉంటే.. ఆ దేశ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలే తమవంతు నియంత్రణ చర్యలు తీసు కుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: