విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అక్క‌డి కార్మికులు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు మ‌ద్ద‌తు తెలిపారు అమ‌రావ‌తి రైతులు. బంద్ సంద‌ర్భంగా షాపుల‌ను స్వ‌చ్చందంగా రైతులు మూసివేసి తమ నిరసన తెలిపారు. బంద్ కు ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు అని చెపుతూ బ‌స్సులు తిప్పుతుండ‌డంపై అగ్ర‌హం వ్య‌క్తం చేసిన రైతులు... బస్సులను అడ్డుకున్నారు. ప్ర‌భుత్వం త‌న ద్వంద ప్ర‌మాణాలు మానుకోవాలంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేసారు. రోడ్డు ర‌వాణా మంత్రి చెప్పినా బ‌స్సులు ఎలా రొడ్డు మీద‌కు వ‌చ్చాయంటూ నిర‌స‌న‌ వ్యక్తం చేసారు.

క‌నీసం న‌ల్ల‌బ్యాజ్జీలు కూడా లేకుండా ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి మాట ఆర్టీసీ సిబ్బంది విన‌డం లేదా అంటూ ప్ర‌శ్నలు వేసారు. స‌చివాల‌యం ఉద్యోగులు, హైకోర్టు  ఉద్యోగుల కోస‌మే అధికారుల ఆదేశం మేర‌కే బ‌స్సులు తిప్పుతున్నామని ఆర్టీసీ సిబ్బంది వెల్లడించారు. విశాఖ ఉక్కుపై ప్ర‌భుత్వం ద్వంద్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా రొడ్డుపై మంద‌డంలో బైటాయించిన అమ‌రావ‌తి రైతులు... బ‌స్సులు వెనెక్కి వెళ్ళే వ‌ర‌కూ క‌దిలేదంటూ నిర‌స‌న కొన‌సాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే విజయవాడలో ప్రశాంతంగా బంద్‌ జరుగుతుంది.

బిజేపీ, జనసేన మినహా బంద్‌లో అన్ని రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. విజయవాడ లెనిన్‌ సెంటర్‌నుంచి నిరసన ప్రదర్శన  చేస్తున్నాయి విపక్షాలు. ప్రదర్శన లో వామపక్షాల అగ్రనేతలు మధు, నారాయణ పాల్గొన్నారు. స్వచ్చందంగా దుకాణాలు, విద్యా సంస్థలు మూసివేసారు. సినిమా హాళ్ళలో ఉదయం ఆట ఉండదు అని అధికారులు చెప్పారు.  డిపోల కె ఆర్.టి.సి బస్సులు పరిమితం అయ్యాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మచిలీపట్నంలో బంద్ జరుగుతుంది. స్వచ్చందంగా బంద్ లో వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. కోనేరు సెంటర్ లో జరిగిన బంద్ లో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర... విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: