ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలు జోరు పెంచారు. పంచాయితీ ఎన్నికల్లో చేసిన తప్పులు ఈ ఎన్నికల్లో చేయకుండా టీడీపీ జాగ్రత్త పడుతుంది. మరో వైపు ఈ ఎన్నికల్లో కూడా గెలుపు సాధించాలని వైసీపీ కాసుక్కొని కూర్చుంది. కాగా, ఇప్పుడు బీజేపి, జనసేన నేతలు కూడా ఈ రెండు పార్టీలకు పోటీని ఇస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగినట్లే ఈ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు పెరిగాయి.  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అందిస్తోన్న సంక్షేమ పథకాల ప్రజా రంజక పాలనకు ప్రజామోదం ఉంది. దీనికి మునిసిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలు దర్పణం పడుతున్నాయి. అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించారని  వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.


మునిసిపాలిటీల్లో 20,197 వార్డులకు గాను 571 మంది వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు వీలుగా త్వరలోనే 550 అర్బన్‌ క్లినిక్‌లను ప్రారంభిస్తామని ఏపి మంత్రులు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ మేరకు నాలుగు పేజీల కరపత్రాన్ని పంపిణీ చేస్తోంది.


 'నగరాభివృద్ధిలో నవశకానికి శ్రీకారం.. జగనన్న పాలనలో అభివృద్ధి బంగారం' శీర్షికతో ముద్రించిన ఈ కరపత్రంలో.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతును ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటికే పింఛన్లు, రేషన్‌ సరుకులు.. వార్డు సచివాలయాల ద్వారా ఇతర పౌరసేవలు, చదువు-బడి పేరిట కార్యక్రమాలు.. వైద్యం- ఆరోగ్యం, రైతు-వ్యవసాయం, అక్క చెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు, ఎంఎస్ఎంఈ వైఎస్ఆర్‌ నవోదయం, పట్టణ, నగర ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో వివరించారు.అధికారాన్ని చేతిలో ఉంచుకొని ఇలా ప్రచారానికి దిగవద్దని ప్రతి పక్షాలు మండిపడుతున్నారు. ఏదీ ఏమైనా కూడా ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా పాతుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: