ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ భారతీయ జనతా పార్టీ మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు అని రాజకీయ వర్గాలు ముందు నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు భారతీయ జనతా పార్టీ పెద్దలతో అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన వాళ్లతో సన్నిహితంగా ఉండే ప్రయత్నమూ ఎక్కువగా చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీలో ఉన్న రాష్ట్ర స్థాయి నేతలు కూడా ముఖ్యమంత్రి జగన్ తో ఎక్కువగా సావాసం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటివరకు జగన్ ను విమర్శించలేదు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఇక నుంచి మాత్రం విమర్శించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడుతున్నారు అని ఆరోపణలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా నష్టపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమస్య మీద దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో జగన్ ఇక బీజేపీ  మీద సీరియస్ గా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి సహాయం చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో కూడా తాను బలపడాలి అని భావిస్తున్న క్రమంలో కొన్ని కొన్ని శక్తులను ప్రోత్సహించడం వంటివి ముఖ్యమంత్రి జగన్ సహించడం లేదు. అందుకే ఇక నుంచి బీజేపీ విషయంలో జగన్ కాస్త కఠినంగానే ముందుకు వెళ్ళవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: