భారతీయ జనతా పార్టీ దెబ్బకు చాలా పార్టీలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడే క్రమంలో ఆ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. అందుకే బిజెపి నేతలతో ఆయన ఎక్కువగా స్నేహం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.

బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ద్వారా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనేక విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయంగా ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరమే ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టాలి అంటే బిజెపి అవసరం చంద్రబాబు నాయుడుకు  ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిజెపి విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్టు గా రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఇప్పటివరకు బిజెపితో కలిసి ముందుకు వెళితే తనకు కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉండవు అని గ్రహించిన చంద్రబాబు నాయుడు మాత్రం అలా ఉండే అవకాశాలు లేకపోవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తప్పులను గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపితో కలిసి వెళ్లడం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడతారని వాళ్లు కూడా ఆసక్తిగా పనిచేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలాచోట్ల వామపక్షాలతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ రాజకీయం తెలుగుదేశం పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: