కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను మార్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వెళ్లి ఇబ్బంది పెట్టగలరు అనే విశ్వాసాన్ని బిజెపి పెద్దలు వ్యక్తం చేస్తున్నారని అందుకే ఇప్పుడు ఆయనకు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే నిమ్మగడ్డ తో కేంద్ర హోం శాఖ కూడా మాట్లాడిందని ఆయన కూడా గవర్నర్ పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈనెల 31 తర్వాత ఆయన ఎన్నికల కమిషనర్ గా రాజీనామా చేయనున్నారు. దీంతో ఆయనకు గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తే బిజెపికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అంశాల్లో తెలుగుదేశం పార్టీని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడినట్టు గా కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంలేదు. గవర్నర్ ని కలిసిన తర్వాత ఆయన కాస్త వెనక్కు తగ్గారు అనే ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: