మునిసిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు, పోలీసులు ద్వారా టీడీపీ అభ్యర్థులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఎన్నికల అధికారి, కలెక్టర్ గంధం చంద్రుడు కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. నిన్న కలెక్టర్ ను కలసిన వీరు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. నామినేషన్ల విత్ డ్రా తో పాటు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను కలెక్టర్ కు వివరించారు. మరీ ముఖ్యంగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా పని చేయించుకుంటున్నారు అని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 


దీనిపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ అనంతపురంలో ఏకగ్రీవాలు తీసుకునేందుకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని.. అయితే ఇతర పార్టీలతో కలసి తాము దీనిని ప్రతిఘటించామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంతృత్వ పోకడలు సరికావని హితవు ప్రభాకర్ హితవు పలికారు. అధికార పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక మరోపక్క మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మరో 24 మంది టీడీపీ కార్యకర్తలకు బెయిల్ నిరాకరించింది అనంతపురం జిల్లా కోర్టు. 


రాయదుర్గం పట్టణంలో గత సంవత్సరం మార్చి నెలలో మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్ తిరస్కరణ రోజు 29 వార్డు టీడీపీ తరఫున నామినేషన్ వేసిన టంకశాల హనుమంతుకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తిరస్కరించడం జరిగింది. ఎలా తిరస్కరిస్తారని మున్సిపల్ కమిషనర్ ను అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను బెదిరించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మరో 24 మంది టిడిపి కార్యకర్తలపై రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా అనంతపురం జిల్లా కోర్టులో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అతని అనుచరులకు ముందస్తు బెయిల్ నిరాకరించిన అనంతపురం జిల్లా కోర్టు. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: