తెలంగాణ గవర్నర్ ను మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు గత కొంత కాలంగా మనం  వింటూనే ఉన్నాం. అయితే తెలంగాణ గవర్నర్ మాత్రం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రాజభవన్ కి మాత్రమే పరిమితమైన ఆమె... ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని సంకేతాలు ఇస్తున్నారు. త్వరలోనే ఆమె గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.

అయితే ఇప్పుడు అదిలాబాద్ జిల్లాలో ఆమె పర్యటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు కూడా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అదిలాబాద్ జిల్లాలో పర్యటన చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని అంటున్నారు. అధికారులు కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అని సమాచారం.

ఇక నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పర్యటించడానికి ఇప్పటికే ఆమె ఒక రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి బిజెపి అధిష్టానం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారుతుందని చెప్పాలి. మరి గవర్నరుగా ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తారు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల విషయంలో ఆమె ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: