ముఖ్యమంత్రి జగన్ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన మీడియాను గత ఇరవై రెండేళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఎక్కడా కలవలేదు. మరో వైపు చూస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు బయటపెట్టలేదు. అత్యవసరం అయితేనే జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఇక ఢిల్లీకి వెళ్ళినా ఒక్క రోజే అక్కడ పర్యటన ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే పంచాయతీ ఎన్నికల ముందు నుంచి కూడా టీడీపీ హడావుడి ఒక రేంజిలో ఉంది. చంద్రబాబు అయితే ప్రతీ రోజూ జూమ్ యాప్ ద్వారా పార్టీ జనాలకు ఊదరగొట్టాడు. ఇక అదే సమయంలో పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టోను కూడా విడుదల చేసి అభాసుపాలు అయ్యారు. ఇపుడు మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో మార్చి ఎండలను కూడా లెక్కచేయకుండా ఏడు పదుల వయసులో చంద్రబాబు ఊరూ వాడా పట్టుకుని తిరుగుతున్నారనే చెప్పాలి.

తమ పార్టీ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు గట్టి పట్టుదల మీద ఉన్నారు. ఆయన అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. మరో వైపు కుమారుడు లోకేష్ ని కూడా బరిలోకి దింపేసారు. ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ ఎండన బడి ప్రచారాలు చేస్తూ ఉంటే జగన్ మాత్రం కేవలం అధికారిక కార్యక్రమలు సమీక్షలు అంటూ తాడేపల్లిలోనే ఉంటున్నారు.

ఎన్నికల వేళ కేవలం ఆయన పర్యవేక్షణకే పరిమితం అయ్యారు. ముఖ్యమంత్రిగా తాను వెళ్లి జనాలను ఓట్లు అడగాల్సిన దాని కంటే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులే జనంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని జగన్ పక్కా ప్లాన్ తో ఉన్నారు. పంచాయతీలను అలాగే గెలుచుకున్నారు. ఇపుడు మునిసిపాలిటీలలో  ఏకగ్రీవాలలో కూడా అలాగే బోణీ కొట్టారు. ఇక మునిసిపలి ఎన్నికల్లో కూడా అనుకున్నట్లుగా వైసీపీ గెలిస్తే జగన్ వ్యూహం కరెక్ట్ అని భావించాల్సి ఉంటుంది. మరో వైపు ఎండలలో తిరిగి కూడా టీడీపీ విజయం సాధించకపోతే చంద్రబాబు, లోకేష్ మరింత డీలా పడాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: