విశాఖలో బంద్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించి మైకు పట్టుకుని, మానవహారం  చుట్టూ తిరుగుతూ అందరి అభిప్రాయాలు తీసుకున్న విజయసాయిరెడ్డి.. మద్దిలపాలెంలో వామపక్షాల బంద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క వాహనం కూడా నిలపలేదు...అన్ని వాహనాలు యధావిధిగా వెళ్తున్నాయి అని అన్నారు. దీనిని బంద్ అంటారా అని వామపక్ష నేతలను నిలదీసిన విజయసాయిరెడ్డికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సిపిఎం నేత కుమార్.

మీ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు...జెండా కూడా పట్టుకోలేదని ఆయన అన్నారు. కరోనాకు భయపడేవాళ్ళు ఏం ఉద్యమం చేస్తారని విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని వామ పక్ష నేత ఒకరు ప్రశ్నించారు. ఎవరితో పని జరిగిందో చెప్పాలని విజయసాయిరెడ్డి దాటవేశారు. ప్రభుత్వం ఇప్పుడెలా సహకరిస్తుందో అలాగే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి, ప్రభుత్వాన్ని కలిసి, బాధ్యత తీసుకోవాలని వామపక్ష నేతలు కోరారు.

ఓటమి  అయితే ప్రభుత్వానిది... గెలుపు అయితే అందరిదీ అనే మాట కాకుండా గెలుపోటములు అందరూ సమిష్టి బాధ్యత తీసుకోవాలని సమాధానం ఇచ్చారు విజయసాయి రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మా పోరాటం చివరి వరకు కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేసారు. దీనికి మేం కట్టుబడి ఉన్నాం అని అన్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పప్పు నాయుడు డ్రామాలాడుతున్నారు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.  విషయమైనా ఏదైనా సరే సమిష్టిగానే పోరాడుతాం అన్నారు. కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపుకి మీ వెంట నడుస్తాం అన్నారు. కార్మిక సంఘాలు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం అన్నారు విజయసాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: