ఏపిలో వరుసగా సంక్షేమ పథకాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో జగన్ ముందుకు సాగుతున్నారు. కాగా, సీఎం అమలు చేస్తున్న పథకాలలో ఒకటి రేషన్ డోర్ డెలివరీ.. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్ కు మొదటి నుంచి షాక్ లు తగులుతున్నాయి. పంచాయితీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని అమలు చేయాలని భావించిన జగన్ సర్కార్ కు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది..మళ్లీ హైకోర్టు ఈ పథకం పై విచారణ జరిపి రేషన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇంటింటికీ రేషన్ సరుకులు అందుతున్నాయి.


కొన్ని ప్రాంతాల్లో సరుకులు ఇంటింటికీ కాకుండా  జనాలే వాహనం దగ్గరకు వచ్చి సరుకులను తీసుకుంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా జనాలకు మంచి చేస్తామని జగన్ సర్కార్ పేర్కొన్నారు.ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో శుభవార్త ను అందించింది. రేషన్ కార్డు దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు రేషన్ సరుకుల పంపిణీ పై పౌర సరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. అదేమంటే మార్చి 6 నుంచి మార్చి నెల రేషన్ పంపిణీ ప్రారంభం కానున్నది. అంతే కాక ఫిబ్రవరిలో రేషన్‌ తీసుకోని వారికి మరో అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది.


మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు క్వారీ ఫార్వర్డ్ ఆప్షన్ విధానం ప్రవేశ పెట్టింది. అంటే ఫిబ్రవరి, మార్చి రేషన్ ఒకే సారి పొందే అవకాశాన్ని పౌర సరఫరాల శాఖ కల్పించింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఒక రోజు రేషన్‌ పంపిణీకి విరామం ఇవ్వనున్నారు. అయితే అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం ఈ రేషన్‌ పంపిణీ కొనసాగనున్నది.. ఇలా చేయడం వల్ల వ్యాన్ వచ్చిన సమయంలో అందుబాటు లేకపోయినా కూడా వచ్చే నెలలో తీసుకోవచ్చు . గ్రామాల్లో ఉండే వాళ్లకు ఈ పథకం బాగా ఉపయోగ పడుతుంది. ఈ ఆలోచన కొంతవరకు బాగుండటంతో మున్సిపల్ ఎన్నికల్లో జనం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.. మళ్లీ జగన్ ఖాతాలో రికార్డ్ పడబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: