విశాఖ మేయర్ సీటు కోసం అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ఏలాగైనా వైసీపీని సిటీలోకి ఎంట్రీ ఇవ్వకుండా నిలువరించాలని టీడీపీ అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ అంతా తన సత్తా చాటినా కూడా వైసీపీకి విశాఖ సిటీలో మాత్రం నో ఎంట్రీ బోర్డే కనిపించింది.

దాంతో ఏడేళ్ళుగా చేస్తున్న రాజకీయ పోరాటాన్ని క్లైమాక్స్ కి చేర్చడానికి వైసీపీ అన్ని దారులూ వెతుకుతోంది. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా భీకరమైన పోరే సాగిస్తోంది. అన్ని విధాలుగా టీడీపీ వీక్ అయిన వేళ టైమ్ చూసుకుని దెబ్బ కొడితే గట్టిగా తగలాలన్నదే అధికార పార్టీ వ్యూహం. ఇంకోవైపు చూసుకుంటే టీడీపీకి విశాఖ సిటీ మీదనే అన్ని రకాలైన హోప్స్ ఉన్నాయి. మొత్తం ఏపీలో ఏం జరిగినా కానీ. విశాఖ మేయర్ సీటు పడితే మాత్రం జగన్ మీద అచ్చమైన విజయం సాధించినట్లు అవుతుందని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. విశాఖ జనాలు జగన్ రాజధానికి ఏకగ్రీవంగా నో చెప్పేశారని చాటాలని కూడా టీడీపీ ఆరాటపడుతోంది.

అయితే ఇపుడున్న రాజకీయ పరిస్థితులు తీసుకుంటే వైసీపీ ఏకపక్ష విజయాన్ని ఆపడం వరకూ టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయేమో కానీ వైసీపీకి మేయర్ సీటుని దూరం చేయడం మాత్రం టీడీపీ వల్ల కాదు అంటున్నరు. వైసీపీ అనేక చోట్ల గతం కన్నా ఇపుడు బలంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి బలమైన నేతలు వైసీపీలోకి వచ్చి చేరిపోవడంతో వైసీపీలో గెలుపు ధీమా ఒక్కసారిగా పెరిగింది. అయితే సింపుల్ మెజారిటీ వస్తుందని, మేయర్ పీఠం వైసీపీ పరం అవుతుందని ప్రస్తుత వాతావరణం చూస్తే అర్ధమవుతోంది. వైసీపీ ఊహించీంట్లుగా 70 కి పైగా డివిజన్లు రావడం కష్టమే అంటున్న్నారు మరో వైపు టీడీపీ గతంలో సాధించిన ముప్పయి డివిజన్లు ఈసారి నిలబెట్టుకుంటే గెలిచినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.  
.


మరింత సమాచారం తెలుసుకోండి: