మల్లన్న సాగర్ ముంపు గ్రామలైన ఏటిగడ్డ కిష్టపూర్ ,వేములగట్ గ్రామాల వద్ద కట్ట పనులు పరిశీలించాడానికి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం కేసీఆర్ ,హరీష్ రావు కన్నసన్నలో మెదులుతున్నారు అని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణం రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ వారితో రహస్యంగా పనులు జరపడం దురదృష్టకరం అని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా వుండాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నరు అని ఆరోపించారు.

కొన్ని నెలల క్రితం తహసిల్దార్, చెక్కుల విషయంలో ఆర్డీవో జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొగుట మండల ముంపు గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం విషయంలో, వారికి ఎలాంటి విషయంలో వారికి అండగా ఉండి వారి రుణం తీర్చుకుంటా అని ఆయన స్పష్టం చేసారు. రెండు,మూడు రోజుల్లో ముంపు గ్రామాల పర్యటనపై కార్యాచరణ ప్రకటిస్తా అని అన్నారు. ఇక ఆయనను అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. భూనిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణం అన్నారు.

ముఖ్యమంత్రి ఫాంహౌజ్ లో కూర్చుండి కాంట్రాక్టర్ల కోసం నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నాడు అని మండిపడ్డారు. గజ్వేల్, సిద్దిపేట తరహా మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి అని కోరారు.  కలెక్టర్ కు గాని, ఎంపి ఎమ్మెల్యే కు గాని చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ కట్ట మీదికి రండి అని డిమాండ్ చేసారు. నేను ఒక్కడినే వస్తాను అని అన్నారు.  దొంగల్లాగ దారులు కాచి అరెస్టు చేయడం ఎందుకు అని నిలదీశారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతి రోజు జిల్లా లోసెక్షన్ తర్టీ ఉండడం గమనార్హం అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కి ఒక న్యాయం.. దుబ్బాక కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. అందుకే దుబ్బాక లో మిమ్మల్ని ఓడగొట్టారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: